అల్లు అర్జున్ పుష్ప 2 పై బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ

TV9 Telugu

05 August 2024

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ల  పుష్ప -2 కూడా ఒకటి.

ఇప్పటికే పుష్ప -2 నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇక సాంగ్స్ కు యూట్యూబ్ షేక్ అవుతోంది.

ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప 2 సినిమా షూటింగ్ అవాంతరాలు, ఇతరత్రా కారణాలతో డిసెంబర్ 6కు వాయిదా పడింది.

అయితే ఇప్పుడీ తేదీపై కూడా నీలి నీడలు అలుముకున్నాయి. డిసెంబరులో ఈ సినిమా రిలీజ్ కావడం లేదని రూమర్లు వినిపిస్తున్నాయి.

హీరో అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ కు మధ్య విభేదాలు వచ్చాయని షూటింగ్ ఆపేసి విదేశాలకు వెళ్లిపోయారని పుకార్లు వస్తున్నాయి.

తాజాగా ఈ రూమర్లపై స్పందించిన చిత్ర బృందం.. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారంది

హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు షూటింగ్ లో  పాల్గొంటున్నారని, సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా వుండబోతున్నాయంది

అల్లు అర్జున్‌ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్‌ కోసం వెయిట్‌ చేయడమే తరువాయి అంటు వాయిదాపై వస్తోన్న రూమర్లను కొట్టిపారేశారు  చిత్ర యూనిట్‌ సభ్యులు.