పొరపాటున సుకుమార్ పూర్తి పేరు చెప్పేసిన అల్లు అర్జున్..
12 December 2024
Basha Shek
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2.. దిరూల్'.
డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది
దీంతో అందరికీ ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది పుష్ప 2 చిత్ర బృందం.
ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ మొదటిసారి దర్శకుడు సుకుమార్ పూర్తి పేరును రివీల్ చేశాడు.
పుష్పపై ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్. పుష్ప 2 విజయం క్రెడిట్ అంతా మా దర్శకుడు 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి'కి చెందుతుంది
సుకుమార్ విజన్ నుంచే ఈ సినిమా పుట్టింది. ఈ చిత్రం కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు' అని చెప్పుకొచ్చాడు బన్నీ.
ప్రస్తుతం అల్లు అర్జున్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. సుకుమార్ అసలు పేరు ఇదా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
కాగా సినిమా దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు సుకుమార్. ఆర్య ఆయన మొదటి సినిమా
ఇక్కడ క్లిక్ చేయండి..