పుష్ఫ2 కోసం బన్నీ షాకింగ్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా?

24 October 2024

Basha Shek

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇందులో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు కూడా వచ్చింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ తో సినిమాలు తీసేందుకు అగ్ర దర్శకులు, నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా పుష్ప కు సీక్వెల్ గా వస్తోన్న పుష్ప 2 ది రూల్ కూడా బాగా హైప్ పెరిగిపోయింది. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పుష్ప2 సినిమా కోసం అల్లు అర్జున్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం ఏకంగా రూ.300 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది

ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఒక వేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా ఇండస్ట్రీలో బన్నీ రికార్డు సృష్టించినట్లే.

పుష్ఫ 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది