రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

17 October 2023

దేశ రాజధాని ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుకలు ఘనంగా జరిగింది ఈ వేడుకల్లో టాలీవుడ్ ప్రముఖులు హాజరు అయ్యారు.

పుష్ప చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ పురస్కారాన్ని అందుకునేందుకు ఫ్యామిలీతో ఢిల్లీకి చేరుకున్నారు బన్నీ.

ఇక ఉత్తమ నటుడుగా టాలీవుడ్ నుంచి జాతీయ అవార్డు పొందిన మొట్టమొదటి హీరో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకున్నారు.

నేషనల్ అవార్డు రెడ్ కార్పెట్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణితో స్నేహరెడ్డితో కలిసి మెరిశారు. అక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టుగా పుష్పరాజ్ మ్యానరిజాన్ని చేశారు అల్లు అర్జున్

ఇక ఈ అవార్డు విషయమై స్పందించిన బన్నీ.. అవార్డు అందుకోవడం చాలా అందంగా ఉంది. ఓ కమర్షియల్ సినిమాతో ఈ అవార్డు తీసుకోవడం బెస్ట్ అచీవ్ మెంట్ అని అన్నారు.

బన్నీతో పాటు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు వేడుకలో పాల్గొన్నారు.