TV9 Telugu
పుష్ప2 నుంచి మరో టీజర్.! సుక్కు ప్లాన్ అదిరింది.
20 April 2024
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్.. అనుమానమే లేకుండా అందర్నీ ఆకట్టుకుంది.
ఆ టీజర్ చూసిన బన్నీ ఫ్యాన్స్ ను ఎగిరి గంతేసేలా చేసింది. మూవీ ప్రేక్షకుల సైతం వావ్ అనేలా ఉంది టీజర్.
టీజర్ దెబ్బకు యూబ్యూట్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అదే టైంలో టీజర్ పై కొందరు విమర్శలు గుప్పించారు.
కానీ దాంతో పాటే.. టీజర్లో బన్నీ ఒక్క డైలాగ్ అయినా చెబితే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది.
ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలీదు కానీ.. తొందర్లో మరో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట సుకుమార్.
ఇక ఆ టీజర్లో మాస్, క్లాస్ అందర్నీ ఫిదా చేసే అన్ని సీన్లతో పాటే.. పుష్ప చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉండనుందట.
దీనిపై ఆఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ రాలేదు కానీ.. ఇండస్ట్రీ వర్గాల నుండి అన్ ఆఫీషియల్ గా లీకైన సమాచారం.
త్వరలో దీనిపై ఎలా స్పందిస్తారేమో చూడాలి మరి..! సో ఐకాన్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ పుష్ప2 సెకండ్ టీజర్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి