Payal Rajput: పుష్పరాజ్‌ చెప్పిన ఆ మాటలకు పొంగిపోయిన పాయల్‌ 

17 November 2023

ఆర్‌ ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌

అయితే ఆ తర్వాత ఈ అమ్మడిని దురదృష్టం వెక్కిరించింది. మంచి ఆఫర్లు వచ్చినా సక్సెస్‌ మాత్రం రాలేదు

ఇప్పుడు తనకు మొదటి సినిమా ఛాన్స్‌ ఇచ్చిన అజయ్‌ భూపతి డైరెక్షన్‌లోనే మంగళవారం సినిమా చేసింది

శుక్రవారం (నవంబర్‌ 17) రిలీజైన ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ సినిమాకు థియేటర్ల వద్ద సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. 

కాగా మంగళవారం సినిమా కోసం ఎంతో కష్టపడింది పాయల్‌. పల్లెటూరి అమ్మాయిలా కనిపించేందుకు చాలా పాట్లు పడింది.

'పాయల్‌.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది' అని అల్లు అర్జునే స్వయంగా ఈ ముద్దుగుమ్మపై ప్రశంసలు కురిపించడం విశేషం