అల్లు అర్జున్ ఫోన్ వాల్‌పేపర్‌ చూశారా? హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

17  November2025

Basha Shek

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

AA22xA6 (వర్కింగ్ టైటిల్‌) ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది

గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వంటి హాలీవుడ్ సినిమా తరహాలో తెరకెక్కుతోన్న ఈ పాన్ వరల్డ్ మూవీ షూటింగ్ చకా చకా జరుగుతోంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పర్సనల్ జిమ్ ట్రైనర్‌ లియోర్డ్‌ స్టీవెన్స్‌ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్‌ చేశాడు

అందులో వర్కవుట్స్ చేస్తోన్న అల్లు అర్జున్ తో పాటు అతని మొబైల్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా ఈ వైరల్ వీడియోలో అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్ ఇప్పుడు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  ఎందుకంటే.. 

 అల్లు  అర్జున్ ఫొన్ వాల్‌పేపర్‌పై నో స్నాక్,  నో షుగర్,  నో సోడా అనే మూడు సింపుల్ అండ్ హెల్డీ లైన్స్‌ ఉన్నాయి.

కాగా ఈ లైన్స్ కింద 2026 మార్చి 27 కూడా ఉంది.  అంటే వచ్చే ఏడాది మార్చి 27 వరకు బన్నీ  ఈ నిబంధనను ఫాలో అవుతాడన్నమాట.