24 November 2023

రెట్రో లుక్‌లో బన్నీ.. మరో సాలిడ్ ప్రయోగం చేస్తున్నాడుగా..

పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ రా అండ్ రస్టిక్ థీమ్‌ను అడాప్ట్ చేసుకున్నారు.

తన మునుపటి సినిమాలకు భిన్నంగా.. డీ గ్లామరస్‌ రోల్లో కనిపించారు. 

ఇక ఇప్పుడు అలాంటి మరో ప్రయత్నమే చేసేందుకు రెడీ అవుతున్నారట బన్నీ

తను త్రివిక్రమ్‌ డైరెక్షన్లో చేయబోయే సినిమాను 1947 బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేస్తున్నారట.

ఎట్ ప్రజెంట్ పుష్ప ది రూల్ సినిమా షూట్‌తో బిజీగా ఉన్న బన్నీ.. 

ఆ సినిమా అయిపోగానే త్రివిక్రమ్‌ సినిమాకు రెడీ అవనున్నారట. 

అందుకోసం అల్లు అర్జున్ 1947 ..రెట్రో లుక్‌లోకి మారిపోనున్నారట . 

త్రివిక్రమ్‌ ఊహలను అందుకునేలా.. పర్ఫెక్ట్ రెట్రో లుక్‌ లోకి ట్రాన్స్‌ఫాం అవనున్నారట ఐకాన్ స్టార్.