అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు. అందులోనూ 2021లో రిలీజ్ అయిన పుష్ప సినిమా బన్నీ క్రేజ్‌ను, పాపులారిటీని అమాంతం పెంచేసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.
సినిమాల సంగతి పక్కన పెడితే.. కుటుంబానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు బన్నీ. సమయమొచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు.
మార్చి06 అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
"మన వివాహమై 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత ప్రేమను, శక్తిని ఇచ్చావ్.
మనం ఇలా మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ క్యూటీ" అని తన భార్యపై ప్రేమను కురిపించాడు అల్లు అర్జున్.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.