స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరో. పుష్ప సినిమాతో బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
ప్రతిష్టాత్మకమైన బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాకు ప్రాతినిధ్యం వహించిన తొలి తెలుగు నటుడిగా మరో గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే ఈ క్రమంలోనే కార్యక్రమంలో బన్నీ తన అభిమానులతో మాట్లాడుతుండగానే అయాన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
స్టేజ్ పై బన్నీ మాట్లాడుతుండగా.. మీ బుడ్డోడు అల్లు అయాన్ ఎలా ఉన్నాడు అన్నా అంటూ ఓ అభిమాని అడిగేశాడు.
దీంతో బన్నీ నవ్వుతూ.. ‘అయాన్.. మోడల్ బోల్తే’ అంటూ అయాన్ సిగ్నేచర్ ను షేర్ చేశాడు. ఇక తన కొడుకు గురించి బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
కరోనా లాక్ డౌన్ నుంచి మొన్నటి వరకు అయాన్ కు సంబంధించిన ఫన్నీ వీడియోస్ అన్నింటిని నెట్టింట షేర్ చేస్తూ.. మోడల్ అయాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం `పుష్ప2` శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ రెండో పార్ట్ ఎండింగ్‌లో విజయ్ సేతుపతి కనిపించబోతున్నారని తెలుస్తుంది.