12 February 2025

ఇన్ స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్నా అల్లు అర్జున్.. ఎవరంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంతగానో అభిమానించే హీరో. పుష్ప 2 సినిమాతో మరింత క్రేజ్ వచ్చేసింది.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. 

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలు కొట్టాడు బన్నీ. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలపై మరింత ఆసక్తి ఏర్పడింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ అల్లు అర్జున్ ఇన్ స్టా గురించి గమనించారా..? 

ఇన్ స్టాలో అల్లు అర్జున్‏ను ఫాలో అయ్యేవారి సంఖ్య 28.5 మిలియన్స్ ఉండగా.. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తొలి సౌత్ హీరోగా రికార్డ్ అందుకున్నాడు. 

కానీ అల్లు అర్జున్ మాత్రం ఇన్ స్టాలో కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఆ ఒక్కరు మరెవరో కాదు బన్నీ సతీమణి స్నేహరెడ్డినే. 

ఇన్ స్టాలో బన్నీ తన భార్యను మాత్రమే ఫాలో అవుతున్నాడు. ఇక ఇన్ స్టాలో స్నేహ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు 9.3 మిలియన్.

ప్రస్తుతం అల్లు అర్జున్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు సమాచారం. త్వరలోనే బన్నీ కొత్త సినిమాల ప్రకటనలు రానున్నట్లు టాక్.