పుష్ప తర్వాత ఎలాంటి సినిమా చేయాలో బన్నీకి క్లారిటీ లేదా..
25 September 2023
పుష్ప తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అల్లు అర్జున్‌కి క్లారిటీ లేదా లేదంటే ఆయనకు ఎలాంటి కథ చెప్పాలో దర్శకులు కన్ఫ్యూజ్ అవుతున్నారా..?
అల్లు అర్జున్‌కు పుష్ప మత్తు అంత ఈజీగా వదిలేలా కనిపించట్లేదు. నాలుగేళ్లుగా ఈ కథతోనే జర్నీ చేస్తున్నారు కాబట్టి దీన్ని మించే కథ వినే వరకు కథలు వినాలని డిసైడ్ అయిపోయినట్లున్నారు బన్నీ.
అందుకే చాలా మంది దర్శకులను కలుస్తున్నారు కానీ ఏ ఒక్కర్నీ కన్ఫర్మ్ అయితే చేయట్లేదు. కేవలం త్రివిక్రమ్ మాత్రమే అధికారికంగా బన్నీ సినిమాను ప్రకటించారు.
పుష్ప తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని నిర్మాతలు కన్ఫర్మ్ చేసారు కానీ బన్నీ కోసం చాలా మంది దర్శకులు కథలు అయితే సిద్ధం చేస్తున్నారు.
ఈ లిస్టులో బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, వేణు శ్రీరామ్ లాంటి వాళ్లున్నారు. కానీ బన్నీ మాత్రం ఓ పట్టాన ఎవరికీ ఓకే చెప్పట్లేదు.
తాజాగా అల్లు అర్జున్ ముంబై వెళ్లి జవాన్ దర్శకుడు అట్లీని కలవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జవాన్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలోనూ టీంను అభినందించారు బన్నీ. ఇప్పుడు ముంబై వెళ్లి అట్లీని కలవడంతో.. ఈ ఇద్దరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లే అనే వార్తలొస్తున్నాయి.
బన్నీ ముంబై ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎంతమంది కథలు చెప్తున్నా.. పుష్ప హ్యాంగోవర్ దిగిపోయే స్టోరీ చెప్పిన దర్శకుడికే ఓకే చెప్పాలని ఫిక్సైపోయారు అల్లు అర్జున్.