TV9 Telugu

క్యూట్ ఫొటోస్ తో మరోసారి ట్రెండ్ అవుతున్న అల్లు వారి గారాలపట్టి.

07 March 2024

స్టార్ హీరోలకు సమానంగా వారి పిల్లలకు కూడా ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మహేష్ కూతురు సితార ఆ లిస్ట్ లో ఉంది.

తాజాగా ఆ లిస్ట్ లో బన్నీ డాటర్ అల్లు అర్హ చేరింది. అయితే అర్హ కు సోషల్ మీడియాలో సొంత అకౌంట్ లేనప్పటికీ..

తన మదర్ అల్లు స్నేహ అకౌంట్ ద్వారా తన డాడీ అల్లు అర్జున్ అభిమానులకు కనిపిస్తు అలరిస్తుంది ఈ క్యూట్ బేబీ.

తాజాగా ట్రెడిషనల్ డ్రెస్ లో మరోసారి అందరిని ఆకట్టుకుంది అల్లు వారి గారాలపట్టి. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కొన్ని సార్లు పెయింటింగ్ వేస్తూ , కొన్ని సార్లు అల్లు అయాన్ తో ఆడుకుంటూ అల్లరి చేస్తూన్న అల్లు అర్హ ట్రేండింగ్ లో ఉంటుంది.

సమంత నటించిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ పోషించిన భరతుడి పాత్రకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.!

ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న దేవర మూవీలో అల్లు అర్హ నటించనుందని ప్రచారం సాగుతోంది.

అయితే దీనిపై అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ, దేవర మూవీ టీమ్‌ కానీ ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.