కట్టే కాలేవరకు చిరు అభిమానినే.. అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు.
తాజాగా బేబీ ఈవెంట్ లో పుష్ప2 సినిమాకు సంబంధించిన డైలాగ్ ను లీక్ చేసిన బన్నీ హీరోగా కూడా మరో మెట్టు పైకి ఎదిగారు.
చిరంజీవి చిరు లీక్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుండగా బన్నీ సైతం పుష్ప లీక్స్ అంటూ పుష్ప2 సినిమాలోని కీలకమైన డైలాగ్ ను లీక్ చేసేశారు.
“ఈడంతా జరిగేది ఒకటే రూలు మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్” అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.
ప్రేమలో ఉన్న బాధను చూపించే సినిమాలు కొన్నే ఉంటాయని అలాంటి సినిమాలు తీయాలన్నా కష్టమని బేబీ మూవీ గురించి బన్నీ చెప్పారు.
జీవితాన్ని స్వయంగా చూసి రాస్తేనే ఇలాంటి సినిమాలొస్తాయని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు.
అమీర్ పేట్ లోని ఆటో కుర్రాళ్లు ఎలా ఫీలవుతారో బేబీ సినిమా చూశాక నేను అలానే ఫీలయ్యానని బన్నీ అన్నారు.
బేబీ చిత్ర అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై బన్నీ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
తాజాగా బన్నీ కట్టె కాలేవరకు నేను చిరంజీవి అభిమానినే అంటూ చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ కు దగ్గరయ్యారు.
ఇక్కడ క్లిక్ చేయండి