08 April 2024

అల్లు అర్జున్ రూమ్‏లో ఆ ఇద్దరి ఫోటోస్.. విమర్శకులకు ఎదురునిలబడ్డాడు.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు అల్లు అర్జున్ పేరు నెట్టింట మారుమోగుతుంది. బన్నీ బర్త్ డే సందర్బంగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. అలాగే అటు పుష్పరాజ్ మాస్ జాతర కొనసాగుతుంది. 

తెలుగులో అల్లు అర్జున్ అంటే స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ కేరళలోనూ బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడి వారంతా బన్నీని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. 

గంగోత్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు బన్నీ. నటనపరంగా మెప్పించిన లుక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ వాటికి ఆర్య సినిమాతో కౌంటరిచ్చాడు. 

బన్నీకి డాన్స్ అంటే చాలా ఇష్టం. తన రూంలో మైకేల్ జాక్సన్, చిరంజీవి ఫోటోస్ ఉంటాయని.. చిన్నప్పటి నుంచి వారిద్దరి డాన్స్ చూస్తూ డాన్స్ నేర్చుకున్నానని చెప్పారు. 

ప్రతి సినిమాలో ప్రయోగాలు చేసేందుకు ముందుంటారు బన్నీ. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి ఆలోచించకుండానే నటించేందుకు రెడీగా ఉంటారని నిరూపించారు. 

గుణశేఖర్ దర్శకత్వం వహించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు బన్నీ. ఇందుకు తెలంగాణ శైలి మాట్లాడం నేర్చుకున్నాడు. రెమ్యునరేషన తీసుకోలేదు. 

అలాగే డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో రాజు పాత్రలో కనిపించారు. విభిన్నమైన కథ ఉంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీగా ఉంటానని మరోసారి నిరూపించారు. 

ఇక ఇప్పుడు పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాదిపాటు చిత్తూరు యాసను సాధన చేశారు బన్నీ. బద్రినాథ్ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు.