అప్పుడే AAA ప్రకటన.. సమంత న్యూ ఫోటోషూట్..

TV9 Telugu

03 April 2024

ఎస్ ఎస్ రాజమౌళి బ్లాక్ బస్టర్ RRR తీసినట్లు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా AAA ప్లాన్ చేస్తున్నారు.

అక్కడ రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కలిస్తే.. ఇక్కడ AAAలో అల్లు అర్జున్, అనిరుధ్, అట్లీ కలుస్తున్నారు.

అందుకే ఈ కాంబోని AAA అంటున్నారు. ఈ సినిమాపై చాలా రోజులుగా సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం జరుగుతుంది.

ఎప్రిల్ 8న అధికారిక సమాచారం వచ్చేలా కనిపిస్తుంది. ఇందులో సమంత, త్రిష హీరోయిన్లుగా నటించే అవకాశాలున్నాయి.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను తన ఫోటోలతో వేడెక్కిస్తూనే ఉన్నారు టాలీవుడ్ స్టార్ కథానాయకి సమంత రూత్ ప్రభు.

తాజాగా మరోసారి ఈ వయ్యారి భామ అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేసారు. ఇది చుసిన కుర్రాళ్లు అంతా ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. సమంత షేర్ చేసిన ఫోటోలకు వావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ముఖ్యంగా బ్లాక్ డ్రెస్‌లో సామ్ ఎప్పుడూ ఫోటోషూట్ చేసినా అవి దెబ్బకు ఇంటర్నెట్ లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంటాయి.