ఆకట్టుకునేలా ఉంటుంది.. అల్లు అరవింద్‌.. 

TV9 Telugu

25 July 2024

ఆయ్‌ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్‌. థీమ్‌ సాంగ్‌ లాంచ్‌ చేశారు అల్లు అరవింద్‌.

ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, నయన్‌ సారిక జంటగా నటిస్తున్నారు.

అంజి.కె.మణిపుత్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ లో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి త్రిపురనేని, శ్రీవాణి తిదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

రామ్ మిరియాల ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాకి సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది నార్నే నితిన్‌ రెండో సినిమా.

అయ్ చిత్రం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలు ప్రేక్షకులు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాకి ముందు నార్నే నితిన్‌ నటించిన మ్యాడ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇది ఈ సినిమాకి ప్లస్ కానుంది.