అల్లరి నరేశ్‌ కొత్త చిత్రం ఖరారు..

ఇటీవల ఉగ్రం చిత్రంతో బ్లక్ బస్టర్ అందుకున్నారు అల్లరి నరేశ్‌.

తాజాగా అయన కొత్త చిత్రం ఖరారైంది.

#N62 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

1990ల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ మేరకు శుక్రవారం నరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

ఆ వీడియోలో సాంకేతిక బృందాన్ని కూడా పరిచయం చేశారు మూవీ మేకర్స్.

ఈ చిత్రంలో నరేశ్‌ ఓ విభిన్నమైన పాత్రలో ఆకట్టుకోనున్నారు.

ఈ చిత్రం సెప్టెంబరు చివరి నుంచి ప్రారంభం కానుంది.