సాయిపల్లవి రిజక్ట్ చేస్తే ఆ సినిమా ఫట్టే.. ప్రూఫ్ ఇదిగో!
February 12, 2024
TV9 Telugu
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో నటి సాయిపల్లవి రూటే సపరేటు. వృత్తి రిత్యా డాక్టర్ అయిన సాయిపల్లవి నటనపై మక్కువతో సినీ రంగ ప్రవేశం చేసింది
సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమమ్ మువీ సాయి పల్లవి కెరీర్‌ను మలుపుతిప్పిందని చెప్పవచ్చు
సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. అందుకే సాయిపల్లవి చేసే పాత్రలు మన పక్కింటి అమ్మాయి మాదిరిగానే కనిపిస్తాయి
ఇక సినిమా ఎంపిక విషయంలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తుంది. అలా తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను పక్కన పెట్టేసింది
అయితే విచిత్రంగా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్త పడ్డాయి. ఇలా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికొస్తే పెద్ద లిస్టే ఉంది
మెగస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్' చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి రిజెక్ట్ చేసింది. తీరా ఆ చిత్రం విడుదలైన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకోలేక పోయింది
అంతకు ముందు విజయ్ దేవరకొండ సరసన కామ్రేడ్ చిత్రంలో నటించే అవకాశం వస్తే అదీ సాయిపల్లవికి నచ్చలేదట. ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించింది. ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది
ఇక తమిళ్‌లో అజిత్ సరసన వలిమై చిత్రం, చంద్రముఖి 2లో కంగనా రనౌత్ పోషించిన పాత్రలో నటించే అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. ఇవన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే.. ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది