అందరి ప్రయాణం ఆస్కార్ వైపే..

20 September 2023

నాటు నాటు పాటకు ఆస్కార్‌ వచ్చిన ఆనందంతో మిగిలిన పనుల మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు రాజమౌళి. మిగిలిన డైరక్టర్లు మాత్రం.... రాజమౌళి అప్పుడు ఏం చేసి ఉంటారు?

ఆస్కార్‌కి ఎలా అప్రోచ్‌ అయి ఉంటారు అని ఆరా తీస్తున్నారు. నార్త్ టు సౌత్‌, ఇప్పుడు అందరిదీ ఆస్కార్‌ మాటే.

ఏడాదికి ఏ ఒక్క సినిమానో పోటీలో ఉండటం కాదు, నార్త్ నుంచే ఒకటికి రెండు సినిమాలు ఈ ఏడాది ఆస్కార్‌ కల కంటున్నాయి. మరి వాటిలో నెగ్గేదెవరు?

ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలకు పనిచేయడం మామూలు విషయం కాదు. ఆల్రెడీ పఠాన్‌తో వెయ్యి కోట్లకు పైగా అందుకున్న షారుఖ్‌, ఇప్పుడు జవాన్‌తో మరో వెయ్యి కోట్ల వైపు పరుగులు తీస్తున్నారు.

షారుఖ్‌ని రన్నింగ్‌ రేస్‌లో ముందుంచిన కెప్టెన్‌ అట్లీ ఇప్పుడు అంతకు మించి ఆశపడుతున్నారు. ఆస్కార్‌ గురించి ఆరా తీస్తున్నారు.

జవాన్‌ని ఆస్కార్‌ రేసులో నిలబెట్టాలన్న విషయాన్ని త్వరలోనే షారుఖ్‌తో డిస్కస్‌ చేస్తానని అంటున్నారు అట్లీ. షారుఖ్‌ ఓకే చెబితే వెంటనే ప్రాసెస్‌ గురించి ఫాలోఅప్‌ మొదలుపెడతానని అంటున్నారు.

జవాన్‌ సినిమా మాత్రమే కాదు, గదార్‌2 ని కూడా ఆస్కార్‌ బరిలో ఉంచాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మేకర్స్. సన్నీడియోల్‌ నటించిన గదర్‌2 సైలెంట్‌ హిట్‌ అయింది.

'అసలు మీరేమాత్రం ఆలోచించకుండా గదర్2ని ఆస్కార్‌కి పంపండి' అంటూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారట డైరక్టర్‌ అనిల్‌ శర్మకి. కలెక్షన్ల పరంగా 500 కోట్ల మార్చ్ చేసింది గదర్‌2.