ప్రతినాయకి పాత్రలో అలరించనున్న అలియా..

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అలియా భట్‌ గురించి తెలియని వారుండరు.

ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

ఈ చిత్రంతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అలియా.

కాగా ఇప్పుడు ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించనుంది ఈ ముద్దుగుమ్మ.

‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే చిత్రంలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌లో అలియా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపింది అలియా.

మొదటి హాలీవుడ్‌ చిత్రం కావడంతో ఆ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేక చిత్రీకరణను కొనసాగించానని తెలిపింది.