తారక్‌తో ఆలియా... సినిమా ఫిక్స్!

TV9 Telugu

08 March 2024

తారక్‌తో ఆలియా సినిమా చేస్తే చూడాలన్నది నందమూరి అభిమానుల విష్‌ మాత్రమే కాదు, మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం.

త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న తారక్ అభిమానుల కోరిక నెరవేరబోతోందని అంటున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ క్రిటిక్స్.

హృతిక్‌ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ బాలీవుడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వార్‌2.

ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న కేరక్టర్‌లో కనిపిస్తారన్నది వినిపిస్తున్న వార్త.

అయితే ఈ సినిమాలో తారక్‌తో పాటు టాలీవుడ్ సీత ఆలియా భట్ కూడా స్పైగా కనిపిస్తారాని సినీ వర్గాల సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ఇప్పటికే ఆలియాతో చర్చలు జరిపేసిందని టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఆలియా దృష్టి మొత్తం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో చేస్తున్న లవ్‌ అండ్‌ వార్‌ సినిమా మీదే ఉంది.

దీని తర్వాతే వార్‌2 మీద ఫోకస్‌ చేస్తారు. రా ఏజెంట్‌గా తారక్‌ నటిస్తే, పక్కన లేడీ స్పైగా ఆలియా చేస్తే, చూడ్డానికి స్క్రీన్‌ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.