నాకు ఆ సమస్య ఉంది.. షాకింగ్ విషయం బయట పెట్టిన అలియా
21 September 2024
Basha Shek
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల తార అలియా భట్.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది.
సినిమా కెరీర్ ఫుల్ పీక్స్‌లో ఉండగానే నటుడు రణ్‌బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియా. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అలియా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటస్తూ మెప్పిస్తోంది.
ప్రస్తుతం జిగ్రా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. ఈ సినిమా అక్టోబర్ 10వ తారీఖున విడుదల కాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజిబిజిగా గడుపుతోన్న అలియా భట్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
తనకి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సమస్య ఉందన్న అలియా మేకప్ చైర్ లో 45 నిమిషాలకంటే ఎక్కుసేపు కూర్చోలేనని చెప్పుకొచ్చింది
అందుకే మేకప్ ఆర్టిస్టులకు ఈ విషయం గురించి ముందుగానే చెప్పి వీలైనంత త్వరగా తన మేకప్ పూర్తి చేయాలని చెబుతుందట ఈ బ్యూటీ
ఇక్కడ క్లిక్ చేయండి..