పర్సనల్ లైఫ్‌లో రహాతో పొద్దుపోవడమే తెలియడం లేదట ఆలియాకి. రీసెంట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ బ్యూటీకి, లైఫ్‌లో అత్యంత ఇబ్బందికరమైన క్షణాలేంటో తెలుసా?
రహాను వదిలిపెట్టి వేరే చోట్లకు వెళ్లాల్సి రావడం. తనను, తన పాపను జాగ్రత్తగా చూసుకునేవాళ్లను తన చుట్టూ భగవంతుడు ఏర్పాటు చేశాడని అంటారు ఆలియా.
మహిళలు తల్లులయ్యాక ఉద్యోగాలు చేయడం కొత్తేం కాదన్నది ఆలియా ఫీలింగ్. మన బామ్మలు ఎంతో మంది పిల్లల్ని కని, వాళ్ల ఆలనాపాలనా చూస్తూ గంపెడు సంసారాన్ని ఈదేవారు.
వాళ్లతో పోలిస్తే మనం చేస్తున్నదెంత? అని ఎదురు ప్రశ్నిస్తారు ఆలియా. అంతే కాదు, కష్టపడటం మన సంస్కృతి అని కూడా ఫైనల్ టచ్ ఇస్తున్నారు బ్యూటీ.