బాలయ్యను నిరాశపరిచిన కాన్సెప్ట్ తో అక్షయ్ చిత్రం..
08 September 2023
ఏడాదికి మూడు సినిమాలు చేస్తే.. అందులో రెండు రీమేక్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మిషన్ రాణిగంజ్ అనే సినిమాతో వస్తున్నారు ఈ హీరో.
ఏడాదికి మూడు సినిమాలు చేస్తే.. అందులో రెండు రీమేక్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా మిషన్ రాణిగంజ్ అనే సినిమాతో వస్తున్నారు ఈ హీరో.
ఇది కూడా రియల్ గా జరిగిన ఇన్సిడెంటే. 1989లో జరిగిన రాణిగంజ్ బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం.
అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో వందలాది కార్మికులు తవ్వకాల్లో ఉండగా హఠాత్తుగా నీరొచ్చి మైన్‌ని ముంచేస్తుంది.
అప్పటి ఆ ప్రమాదంలో 220 కార్మికులు పని చేస్తుండగా.. 6గురు చనిపోగా 68 మందిని రక్షించి బయటికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యాన్నే సింగరేణికి మార్చి నిప్పు రవ్వ సినిమా చేసారు బాలయ్య. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం 1993లో విడుదలైంది.
నిప్పు రవ్వ విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 30 ఏళ్ళ తర్వాత ఇంచుమించు ఇదే కథను అక్షయ్ కుమార్ చేస్తున్నారు.
సర్వైవల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. రియల్ ఇన్సిడెంట్ కావడంతో.. టైటిల్ కూడా మిషన్ రాణిగంజ్ అనే పెట్టారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి