TV9 Telugu

ఆకాశం నీ హద్దురా రీమేక్‌.. భూల్‌ భులయా థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌..

15 Febraury 2024

సౌత్‌లో సూపర్ హిట్ అయిన సూరరైపోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాకి సౌత్‌లో హీరోగా నటించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హిందీలో వస్తున్న రీమేక్ వర్షన్‌ను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సుధా కొంగర హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. సర్ఫిరా పేరుతో రూపొందుతున్న ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భూల్‌ భులయా సినిమా సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను సిద్ధం చేస్తున్నారు మేకర్స్‌.

సౌత్‌ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన రజినీకాంత్ చంద్రముఖి సినిమాకి రీమేక్‌గా తెరకెక్కింది భూల్‌ భులయా.

ఆ తరువాత అదే కథకు కొనసాగింపుగా 2022లో తెరకెక్కించిన భూల్‌ భులయా 2 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

తొలి భాగంలో కీలక పాత్రలో నటించిన విద్యాబాలన్‌, పార్ట్ 3లో మంజులికగా రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా వెల్లడించారు.