కన్నప్ప సెట్స్ లో ఆ క్రేజీ హీరో..

TV9 Telugu

17 April 2024

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న సినిమా టాలీవుడ్ ఫాంటసీ డ్రామా చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు.

ఏవిఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలతో కలసి మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

పరుచూరి గోపాల కృష్ణ, జి. నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్‌నాయుడు ఈ సినిమాకి కథను అందించారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో శివుని పాత్రలో కనిపించనున్నారు. నయనతార పార్వతి పాత్ర చేయనున్నారు.

ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ లాల్, అక్షయ్‌కుమార్‌, మోహన్ బాబు కూడా నటిస్తున్నారు.

ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, దేవరాజ్, కౌశల్ మంద, రఘు బాబు, అర్పిత్ రాంకా తిదితరులు ముఖ్య పాత్రధారులు.

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా కన్నప్ప షూటింగ్‌లో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌.

ఆయనకు మంచు మోహన్‌బాబు శాలువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. కన్నప్ప సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.