ఏఎన్నార్ జీవితంలో అతిపెద్ద అవమానం అదేనట 

TV9 Telugu

12 JULY 2024

లెజెండరీ నటుడు ఏఎన్నార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 1944లో విడుదలైన శ్రీ సీతారామ జననం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పరిచయం అయ్యారు. 

పెద్దగా చదువుకోని నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి. ఆ సినిమాల మీద ఇష్టం తో చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది.

అయితే  1946లో విడుదలైన ముగ్గురు మరాఠీ లు చిత్రంలో ఏఎన్నార్ నటించారు. ఏఎన్నార్ కి అది మూడో చిత్రం. ఆయనకు ఎలాంటి ఫేమ్ లేదు.

అయితే మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబతో పాటు మరికొందరు నటులు, ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్నార్ కూడా భోజనం చేద్దామని లోపలి వెళ్లబోయాడట.

ఆ  చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్నార్ ని అడ్డగించాడట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వు ఎక్కడికి? నువ్వేమైనా స్టార్ అంటూ  గట్టిగా కసిరాడట.

ఆ తరువాత 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట.  అయితే సూర్యనారాయణ అన్నీ దగ్గరుండి చూసుకునేవారట. 

సూర్యనారాయణతో పుల్లయ్య.. ఏఎన్నార్ మేకప్ వేసుకోవడం పూర్తి అయితే రమ్మను షాట్ రెడీ అని చెప్పాడట. ఏఎన్నార్ పిలవడానికి మేకప్ రూమ్ కి వెళ్ళాడట ఈయన.

అప్పుడు  ఏఎన్నార్ఆ  రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావు, అన్నాడట. ఏదో తప్పైపోయింది క్షమించండి అని సూర్యనారాయణ అన్నాడట.

నీ తప్పేమీ లేదు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను స్టార్ హీరోని కాదు కదా? నువ్వు అలా అనడం భావ్యమే. కన్నాంబ గారు పెద్ద నటులు. అని అన్నారట.