TV9 Telugu
అప్‌డేట్ ఎప్పుడు అయ్యగారు.? అఖిల్ కు ఫ్యాన్స్ సలహా.
16 March 2024
సినిమా సినిమాకీ సీనియర్లే అంతంత గ్యాప్ తీసుకోవడం లేదు.. మీరేంటి ఇలా.? అంటున్నారు అక్కినేని అభిమానులు.
ఇంత యంగ్ ఏజ్‌లో ఇన్ని రోజులు కామ్‌గా ఉంటే ఎలా అంటూ అఖిల్‌ని ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్.
సక్సెస్, ఫెయిల్యూర్స్ ఎవరికైనా కామనే కదా., కెరీర్‌లో నిలదొక్కుకున్న వాళ్లకే ఒడిదుడుకులు తప్పడం లేదు.!
అలాంటిది బిగినర్స్ కి ఉండకుండా ఉంటాయా? కచ్చితంగా ఉంటాయి.. సందేహమే లేదు అంటున్నారు అక్కినేని అభిమానులు.
ఇలా అందరి మాటలూ సైలెంట్‌గా వింటున్న అక్కినేని అఖిల్ మాత్రం తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు.
యువీ క్రియేషన్స్ తెరకెక్కించే అఖిల్ ఏజెంట్ సినిమా తదుపరి సినిమాను అనిల్ కుమార్ డైరక్ట్ చేయనున్నారు.
డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ , సాహో సినిమాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేశారు అంట అనిల్ కుమార్.
హీరో అఖిల్‌ని అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తారో , తన రోల్ ఏంటో చూడాలని వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి