నాగ చైతన్య గురించి అమల షాకింగ్ కామెంట్స్
అక్కినేని అమల ఒకప్పుడు నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు.
సినిమా షూటింగ్ పనులలో తప్ప ఎక్కువగా ఇంటర్వ్యూలకు, ఇతర ఈవెంట్లలో పాల్గొనడానికి అమల ఏమాత్రం ఆసక్తి చూపించరని చెప్పాలి.
ఇలా చాలా తక్కువగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే ఈమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో హాజరయ్యారు.
ఇంటర్వ్యూలో భాగంగా అమల తన కుమారుడు నాగచైతన్య అఖిల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఇంటర్వ్యూలో అమల అఖిల్ కంటే నాగచైతన్య గురించి ఎక్కువగా మాట్లాడటం తనని పొగడటం విశేషం.
యాంకర్ అమలను ప్రశ్నిస్తూ నాగచైతన్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అమల సమాధానం చెబుతూ నాగచైతన్య చాలా తెలివైనవాడు. ఎంతో ధైర్యవంతుడు.
తను తన పని పట్ల సినిమాల పట్ల చాలా ఫోకస్డ్ గా ఉంటారని ఏ విషయంలోనైనా చాలా క్లారిటీగా ఉంటారని అమలా తెలియచేశారు.
చైతన్య చాలా బ్రిలియంట్ పర్సన్ అంటూ అమల చైతన్య గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి