ఇక ఎన్నో అంచనాల మధ్య.. అక్కినేని అభిమానుల హంగామా మధ్య.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కింది ఈ మూవీ.
స్పై థ్రిల్లర్ జోనర్‌లో.. దాదాపు 80కోట్ల బడ్జెట్‌తో. AK ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కింది ఈ మూవీ.
అయితే ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ.. డే1 ఫస్ట్ షోతోనే.. నెగెటివ్ టాక్ వచ్చేలా చేసుకుంది.
సినిమా రిజెల్ట్‌తో.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై విమర్శల వర్షం కురిసింది. ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా రిజెల్ట్ పై ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అంతటా హాట్ టాపిక్ అయింది.
అయితే అప్పటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానీ ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం సోనీ లివ్‌లో... సెప్టెంబర్ 29న స్ట్రీమ్ అవనుంది అఖిల్ ఏజెంట్ మూవీ.
ఇక ఇదే విషయాన్ని తాజాగా సోనీ లివ్.. తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేసింది.
The wait is over! Brace yourself for the wild adrenaline rush! అంటూ ఓ గూస్ బంప్స్ వచ్చే ట్వీట్ చేసింది.