TV9 Telugu
09 January 2024
ఎట్టకేలకు OTTలోకి అఖిల్ ఏజెంట్ మూవీ.
ఒక్క హిట్టు ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే చాలు అని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు అక్కినేని అందగాడు అఖిల్.
ఏజెంట్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోతాడు అని అంతా అనుకున్నారు కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.
ఏజెంట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. తొందరగానే ఓటీటీ వస్తుంది అనుకున్నారు.
సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్నా ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం రావడం లేదు.
అసలు సినిమా ఎలా ఉంది అని చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కానీ ఇంతవరకు ఓటీటీలోకి మాత్రం అడుగుపెట్టడం లేదు ఏజెంట్ . ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
ఎట్టకేలకు ఈ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయని జనవరి 26న ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ లో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి