ఆ స్థానంలో ఎవరున్నా లిప్‌లాక్ చేసేదాన్ని.. నటి ఆకాంక్ష పూరి..

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ ఓటీటీ-2కి హోస్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ షోలో చుట్టూ కెమెరాలున్న విషయాన్నే మర్చిపోయిన ఓ జంట లిప్‌లాక్‌ చేసుకుంది.

ప్రేక్షకులకు ఇది ఏమాత్రం నచ్చకపోవడంతో ఆయన వారిద్దరిపై సీరియస్‌ అయ్యారు.

ఆపై సండే ఎపిసోడ్‌లో ప్రేక్షక లోకానికి నటి ఆకాంక్ష పూరి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

దీనిలో భాగంగానే వారిద్దరిలో  మొదటిగా ఆకాంక్ష పూరి ఎలిమినేట్ అయింది.

తాజాగా షో నుంచి బయటకు వచ్చిన ఆమె తన లిప్‌లాక్, ఎలిమినేషన్‌పై తన అభిప్రాయం తెలిపింది.

షో నుంచి ఇలా ఎలిమినేట్ అయినందుకు చాలా బాధగా ఉందని ఆకాంక్ష తెలిపింది.

అయితే ఆమె లిప్‌లాక్ గురించి మాట్లాడుతూ హౌస్‌లో ఓ టాస్క్ లో భాగం చేశానని, అందులో తప్పేమీ లేదని పేర్కొంది.

షోలో ఒక టాస్క్ కింద తనకు 30 సెకన్ల ఛాలెంజ్ ఇచ్చారని, దీన్ని టాస్క్‌గా మాత్రమే పరిగణించానని ఆమె తెలిపింది.

ఆ స్థానంలో జైద్ కాకుండా మరొకరు ఉన్న తాను ఈ పనిని చేసేదానినని స్పష్టం చేసింది.