హీరో అజిత్ విన్యాసాలు..
TV9 Telugu
06 April 2024
ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేయడంలో కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అజిత్ ఎప్పుడు కూడా ముందుంటారు.
ప్రస్తుతం ఆయన హీరో దర్శకుడు మగిళ్ తిరుమనేని తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విడాముయార్చి సినిమా చేస్తున్నారు.
ఇందులో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తున్నరు. అర్జున్ సర్జ, రెజీనా కసాండ్రా, ఆరవ్ ముఖ్య పాత్రధారులు.
ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ షెడ్యూల్ లో డూప్ లేకుండా మరోసారి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసారు హీరో అజిత్ కుమార్.
ఈ షూటింగ్ షెడ్యూల్ లో ఆయన తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అజిత్.
ఈ సీక్వెన్స్‌ను 2023 నవంబర్‌లో షూట్ చేసినట్లు తెలిపారు అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర. ఏడాది నవంబర్ లో ఈ మూవీ విడుదల కానుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అల్లిరాజా విడాముయార్చి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్ చిత్రానికి నీరవ్ షా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి