అజిత్ ప్లానింగ్ మామూలుగా లేదుగా.. ఫ్యామిలీ స్టార్ విడుదల..
TV9 Telugu
06 April 2024
తమిళ హీరో అజిత్ ప్లానింగ్ మామూలుగా లేదు. 2 నెలల్లోనే రెండు భారీ సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారీయన.
ప్రస్తుతం ఈయన నటిస్తున్న కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా విడాముయార్చి షూటింగ్ చివరిదశకు చేరుకొంది.
మరోవైపు ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కించబోయే యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ త్వరలోనే షూట్ మొదలు కానుంది.
ఇందులో విడాముయార్చి ఈ ఏడాది నవంబర్‌లో రానుండగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి.
ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్.
పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏపీ, నైజాంలోనే కాదు.. తమిళనాడులో కూడా భారీగానే విడుదలైంది అన్నారు మేకర్స్.
ఓవర్సీస్ లో 342 లొకేషన్స్ లో దాదాపు 890 ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 45 కోట్ల వరకు చేసింది ఈ సినిమా.
రాబోయే 10 రోజుల్లో.. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి.. ఇలా హాలిడేస్ బాగా ఉండడం విజయ్ సినిమాకు కలిసి రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి