మంగళవారం దర్శకుడిని వరించిన అవార్డు..
TV9 Telugu
18 April 2024
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తెలుగు సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మంగళవారం.
ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. నటుడు, కమెడియన్ ప్రియదర్శి ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది.
ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేషన్ వర్క్స్ సంస్థల్లో స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం, అజయ్ భూపతి నిర్మించారు.
నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, ముఖ్య పాత్రధారులు.
2023లో నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
తాజాగా మంగళవారం చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు ప్రముఖ తెలుగు దర్శకుడు అజయ్ భూపతి.
ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెప్పారు అజయ్ భూపతి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి