చీరకట్టులో చందమామే ఈ చిన్నది.. ఎంత ముద్దుగా ఉందో..
27 August 2025
Rajeev
ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ చిన్నదని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది. ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు.
ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.
చిన్నతనం నుంచి చెన్నైలో పెరిగిన ఐశ్వర్య రాజేష్.. తన ప్రాథమిక విద్యను హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ నుంచి పూర్తి చేసింది.
2010లో పంచ్ భరత్ దర్శకత్వం వహించిన “నీతనా అవన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీతోనే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్,టక్ జగదీష్,రిపబ్లిక్ సినిమాల్లో నటించింది.