అందానికి ప్రేయసి ఉంటె.. ఈమెలానే ఉంటుందేమో..

TV9 Telugu

08 April 2024

10 జనవరి 1990న తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ తెలుగు హిందూ కుటుంబంలో జన్మించింది అందాల భామ ఐశ్వర్య రాజేష్.

ఆమె తండ్రి రాజేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఐశ్వర్య చిన్నప్పుడే తీవ్ర అనారోగ్యం కారణంగా అయన మరణించారు.

ఈ వయ్యారి తల్లి నాగమణి నృత్యకారిణి. ఈ ముద్దుగుమ్మ తాత అమర్‌నాథ్ కూడా తెలుగు సినిమా నటుడుగా పని చేసారు.

తెలుగులో 500 వందలకు పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ హాస్య నటి శ్రీ లక్ష్మికి మేనకోడలు అందాల భామ ఐశ్వర్య.

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.

చెన్నై నగరంలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌ నుంచి బి.కామ్ లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.

2010లో నీతన అవన్ అనే తమిళ యాక్షన్ కామెడి సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. తర్వాత కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది.

2019లో కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తొలిసారి తెలుగులో నటించింది. తర్వాత మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ చిత్రాల్లో కనిపించింది.