గ్లామర్ సొగసుల చిన్నది.. హద్దులు చెరిపేసిన భాగ్యం...

20 September 2025

Phani Ch

ఐశ్వర్య రాజేష్‌ తెలుగ‌మ్మాయే.. హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు ఈమె. ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి.. 38 ఏళ్ల వ‌య‌సులోనే క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వ‌ర్య రాజేష్. 

ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది. 

సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది. 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికి వస్తే.. ఐశ్యర్య రాజేష్ విషయానికొస్తే.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 

తెలుగు భామ అయిన ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ అక్కడ హీరోయిన్‌‌గా రాణిస్తూ పలు సినిమాల్లో నటించి అదరగొట్టింది. 

ఇక తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు. కానీ వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం  చేసుకుంది.

ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.