మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య లక్ష్మీ.. తొలినాళ్లలో పలు మ్యాగజిన్ కవర్ పేజీల్లో కనిపించింది ఈ అందాల ముద్దుగుమ్మ.
ఆ తర్వాత చెమ్మనూర్ జ్యువెలర్స్, కరికినేత్ సిల్క్స్, లా బ్రెండా, ఎజ్వా బోటిక్, అక్షయ జ్యువెల్స్, శ్రీ లక్ష్మీ జ్యువెలరీ మొదలైన బ్రాండ్లకు మోడల్‌గా చేసింది.
డాక్టర్ అవ్వాలనుకున్న ఐశ్వర్య లక్ష్మీకి.. తొలినాళ్లలో నటనపై ఆసక్తి కనబరచలేదు. అయితే ఆ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసి.. సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
మలయాళంలో 2017న 'నజండుకలుడే నట్టిల్ ఒరిదవేల' అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది ఐశ్వర్య లక్ష్మీ. ఇక 2019లో విశాల్ హీరోగా వచ్చిన 'యాక్షన్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఇటీవల దుల్కర్ సల్మాన్ సరసన 'కింగ్ ఆఫ్ కొత్త'లో నటించింది ఐశ్వర్య లక్ష్మీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. ఐశ్వర్యకు ఎక్కువగా అవకాశాలు రావట్లేదు.
ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ బాట పట్టిన ఐశ్వర్య లక్ష్మీ.. అందాల ఆరబోస్తూ దిగిన ఫోటోలను తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రతిభ కంటే గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీగా మారిందని ఐశ్వర్య లక్ష్మీ కీలక కామెంట్స్ చేసింది.