చిరు ప్రాజెక్ట్స్ విషయంలో డైలమా.. ఒక సబ్జెక్టు ఓకే.. మిగిలినవి..

09 October 2023

భోళా శంకర్‌  సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టడంతో, ఇమీడియేట్‌ ప్రాజెక్టులను కాస్త స్లో చేశారు చిరంజీవి.

ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చిన జోష్‌ని నెక్స్ట్ ఏ సినిమా కంటిన్యూ చేస్తుందా అని వెయిట్‌ చేస్తోంది మెగాసైన్యం.

మెగాస్టార్‌ నెక్స్ట్ ప్రాజెక్ట్... బింబిసార డైరక్టర్‌ వశిష్టతో అనేది ఆల్రెడీ ఫిక్సయింది. కథను కూడా లాక్‌ చేసేశారు. నవంబర్‌లో వైభవంగా పూజతో సినిమాను స్టార్ట్ చేయాలన్నది ప్లాన్‌.

డిసెంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు మెగాబాస్‌. బింబిసారతో మెప్పించిన వశిష్ట అంతకు మించిన మెగా ప్రాజెక్టుతో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ లో బిజీగా ఉన్నారు.

వశిష్టతో మూవీ అయ్యాక, బ్రో డాడీ మూవీ రీమేక్‌లో చిరు నటిస్తారన్నది ఆ మధ్య వైరల్‌ అయిన న్యూస్. ఈ సినిమాకు కల్యాణ్‌ కృష్ణ డైరక్ట్ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే కల్యాణ్‌ కృష్ణ స్టోరీ విషయంలో ఇంకా మెగాస్టార్‌ ఓ డెసిషన్‌ తీసుకోలేదన్నది లేటెస్ట్ న్యూస్‌. కల్యాణ్‌ కృష్ణతో మెగాస్టార్‌ బ్రో డాడీ రీమేక్‌తోనే వెళ్తారా? మరో కొత్త కథకు ఓకే చెబుతారా అనే డైలమా నడుస్తోంది.

పల్లెటూరి అంశాలను బాగా డీల్‌ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు కల్యాణ్‌ కృష్ణ. సోగ్గాడే చిన్ని నాయనతో ఆ విషయాన్నే ప్రూవ్‌ చేశారు.

మెగాస్టార్‌ ఫుల్‌ లెంగ్త్ పల్లెటూరి వాతావరణంలో నటిస్తే చూడాలన్నది కూడా ఆడియన్స్ కోరిక. మరి సోగ్గాడే తరహా ప్రాజెక్టును కల్యాణ్‌ కృష్ణ సిద్ధం చేస్తారా? అనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది.