TV9 Telugu

అనుకొన్నది నిజం చేసిన గూఢచారి.. బుచ్చిబాబుకి విషెస్ చెప్పిన టీం..

17 Febraury 2024

అడివి శేష్ హీరోగా వినయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న టాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘జీ 2’.

2018లో వచ్చిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జరుగుతుంది.

ఇందులో విల‌న్‌గా బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు. వెల్‌కమ్ టూ ఇమ్రాన్ హష్మీ అంటూ ట్వీట్ చేసారు మేకర్స్.

రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతుంది.

ఫిబ్రవరి 15న బుచ్చిబాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు.

బుచ్చిబాబు ఈ సినిమాను చాలా నాటుగా, సహజంగా తెరకెక్కించబోతున్నారని తెలిపింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.

కచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ అభిమానులకు ఇది బ్లాక్ బస్టర్ ట్రీట్ అవుతుందని నమ్ముతున్నారు వాళ్లు.