స్పీడ్ పెంచింది.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్.. 

Rajeev 

28 June 2024

స్టార్ హీరోయిన్ సమంత సినిమాల కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఎప్పుడెప్పుడు ఈ చిన్నది స్క్రీన్ పై కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఫాన్స్. సామ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నా అని అనౌన్స్ చేసింది సామ్. ఖుషి సినిమా తర్వాత ఆమె సినిమాలు చేయలేదు.

తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది సామ్. హిందీలో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాలకు దూరంగా ఉన్న సామ్ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది.

హాట్ హాట్ ఫొటోలతో పాటు రకరకాల వీడియాలను కూడా షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది సామ్.

ఇక ఇప్పుడు సినిమాల్లోకి సినిమాల్లో బిజీ అవ్వడానికి రెడీ అవుతుంది. బంగారం అనే మూవీని అనౌన్స్ చేసింది. దీనితో పాటు ఆదిత్య రాయ్ కపూర్ ఓ వెబ్ సిరీస్ చేస్తుందట సామ్.