సిద్ధార్థ్ లవర్‌కు ఎంత కష్టమొచ్చింది! 6 గంటలకు పైగా..

TV9 Telugu

26 June 2024

ప్రముఖ నటి, సిద్ధార్థ్ ప్రియురాలు ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. తన కష్టాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి వాపోయిందీ అందాల తార.

ఇంగ్లండ్ హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని అదితీ రావు హైదరి ఆవేదన వ్యక్తం చేసింది.

తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా  విమానాశ్రయంలో  వేచి ఉండాల్సి వచ్చిందని,  ఇదొక 'చెత్త ఎయిర్‌పోర్ట్‌ అని కామెంట్ చేసింది అదితి.

అక్కడి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తనకు హెల్ప్ చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్‌లైన్‌ సంస్థను సంప్రదించమని  ఉచిత సలహా ఇచ్చారందీ అందాల తార.

దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ తన చేతికి అందలేదని, ఇదొక చెత్త ఎయిర్ పోర్ట్ అని అదితి సోషల్ మీడియాలో వాపోయింది.

ఇదిలా ఉంటే ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్‌ వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఆదితి రావు హైదరీ.

బాలీవుడ్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్‌లో అదితీ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో హీరామండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక త్వరలోనే సిద్ధార్థ్ ను అదితీ రావు వివాహం చేసుకోనుందని సమాచారం.