ఈ కోమలి స్పర్శ చాలు శీతలం అవుతుంది ఆ గాలి.. గార్జియస్ అదితి..
Prudvi Battula
Credit: Instagram
02 February 2025
28 అక్టోబర్ 1986న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జన్మించింది అందాల తార అదితి రావు హైదరి.
2013లో మరణించిన అదితి తండ్రి అహ్సాన్ హైదరీ సులైమాని బోహ్రాకి చెందిన ముస్లిం. అనారోగ్యం కారణంగా మరణించారు.
ఈ వయ్యారి హిందూ, ముస్లిం, బౌద్ధ మతలను విశ్వసిస్తుంది. కొంకణి, తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు మాట్లాడగలదు.
ఈ ముద్దుగుమ్మ తండ్రి అహ్సాన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి మహమ్మద్ అక్బర్ నాజర్ అలీ హైదరీ మనవడు.
ఈమె తల్లి విద్య రావు వనపర్తి చివరి పాలక రాజు జె. రామేశ్వర్ రావు కుమార్తె. వనపర్తి అప్పట్టి హైదరాబాద్ రాష్ట్రంలోని నాలుగు అతిపెద్ద ఫ్యూడల్ ఎస్టేట్‌లలో ఒకటి.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.
తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టభద్రురాలైంది ఈ అందాల భామ.
ఆరేళ్ల వయసులో ఢిల్లీకి చెందిన ప్రఖ్యాతి గాంచిన లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది ఈ బ్యూటీ.