కనుమరుగైన నటి.. మళ్ళీ క్యూట్ అందాలతో కనులవిందు చేస్తుందిగా..
Phani CH
11 Jul 2025
Credit: Instagram
సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో అవమానాలు, సవాళ్లను ఎదుర్కొని నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి.
నటనపై ఎంతో ఆసక్తితో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సక్సె్స్ అయిన తారలు చాలా మంది ఉన్నారు. కానీ తొలి చిత్రం మిశ్రమ స్పందన అందుకుని నటిగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్స్ చాలా తక్కువ.
అందులో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్. కట్ చేస్తే.. కొన్నాళ్లుగా సినీరంగానికి దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడయాలో గ్లామర్ ఫోజులతో మాయ చేస్తుంది.
టాలీవుడ్ సినీప్రియులకు అదితి గౌతమ్. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. మాస్ మహరాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రవితేజ కాంబోలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ స్టోరీ, డైలాగ్స్, జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.
ఈ చిత్రంలో రవితేజ సరసన నటించి మెప్పించింది అదితి గౌతమ్.. అలియాస్ శియా గౌతమ్. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైంది.
ఆ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది అదితి గౌతమ్. కానీ తెలుగులో అంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఆ తర్వాత హిందీలో సంజూ చిత్రంలో నటించిన ఈ అమ్మడు.
తెలుగులో కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. తాజాగా ఎర్ర చీరలో సింపుల్ లుక్స్ తో మాయ చేస్తుంది అదితి గౌతమ్.