ఆ రోజున విడుదలకు సిద్దమైన ‘ఆదికేశవ’..

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం  ‘ఆదికేశవ’.

వైష్ణవ్‌కి జోడిగా శ్రీలీల ఈ మూవీలో నటిస్తుంది.

శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌, రాధిక తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా తాజాగా శుక్రవారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్.

ఈ చిత్రాన్ని ఆగష్టు 18న విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ఈ మేరకు విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్‌లో వైష్ణవ్‌, శ్రీలీల రొమాంటిక్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.