ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన అదా శర్మ.. 

Rajeev 

27 March 2024

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది  అదా శర్మ.

హార్ట్ ఎటాక్ సినిమాలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది  అదా శర్మ. అయితే ఈ చిన్నది టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

దాంతో సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేసింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల్లో  సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

దాంతో ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అదా శర్మ.

కేరళ స్టోరీ తో భారీ విజయాన్ని అందుకుంది అదా శర్మ. ఈ సినిమా విమర్శలు ఎదుర్కున్న హిట్ గా నిలిచింది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అదా శర్మ. రెగ్యులర్ గా తన ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

హాట్ హాట్ ఫోటోలకు అదా శర్మ పెట్టింది పేరు. ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.

ఇటీవల ఈ అమ్మడు ఇఫ్తార్ విందుకు వెళ్ళింది. అయితే అక్కడ ఈ చిన్నది క్రేజీ కామెంట్స్ చేసింది.

ముస్లింలకు వ్యతిరేకంగా సినిమా తీస్తారు. ముస్లింలు భోజనానికి పిలిస్తే వెళ్తారు అని నెటిజన్ ట్రోల్ చేశారు.

దీని పై అదా శర్మ స్పందిస్తూ..  ఉగ్రవాదులు విలన్లు, ముస్లింలు కాదు అని స్ట్రాంగ్ రీప్లే ఇచ్చింది అదా శర్మ. దాంతో ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.