అందం ఈమెను చూస్తే సెల్ఫీ కోసం వెయిట్ చేస్తుందేమో..

22 October 2023

11 మే 1992న మహారాష్ట్ర రాజధాని ముంబైలో తమిళ బ్రాహ్మిణ్ కుటుంబంలో జన్మించింది అందాల తార చాముండేశ్వరి అయ్యర్ అలైస్ ఆదా శర్మ.

ముంబైలోని నటరాజ్ గోపీ కృష్ణ కథక్ డ్యాన్స్ అకాడమీ నుండి కథక్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

USలో నాలుగు నెలలు సాల్సా నేర్చుకుంది. ఇండియన్ మార్షల్ ఆర్ట్ అయిన సిలంబం కూడా నేర్చుకుంది ఈ వయ్యారి భామ.

2008లో 1920 అనే హిందీ హారర్ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో లీసా సింగ్ రాథోడ్ అనే పాత్రలో నటించింది.

ఈ చిత్రం తరువాత మరో రెండు బాలీవుడ్ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించింది అందాల భామ ఆదా శర్మ.

2014లో నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ చిత్రంతో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.

దీని తర్వాత అల్లు అర్జున్, సమంత జంటగా కనిపించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో పల్లవి కొలసాని అనే పాత్రలో మెప్పించింది.

తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కేరళ స్టోరీ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.