అందం అభినయం ఉన్నా ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందే.. 

Rajeev 

22 January 2025

 తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫాంలోకి వస్తున్న హీరోయిన్లలో ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ ఒకరు.

ఈ అమ్మడు హీరోయిన్ గా చేయడానికి ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. 

విజయ్ సేతుపతి 96, దళపతి విజయ్  బిగిల్ సినిమాల్లో నటించింది వర్ష బొల్లమ్మ. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. 

ఆతర్వాత హీరోయిన్ గా మిడిల్ క్లాస్ మెలోడిస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం చిత్రాల్లో నటించి మెప్పించింది. 

ఇటీవలే సందీప్ కిషన్ నటించిన ఊరుపేరు భైరవకోన సినిమాత్ హిట్ అందుకుంది. కానీ ఆఫర్స్ మాత్రం అందుకోలేకపోతుంది.

తెలుగుతో పాటు అటు తమిళ్ లోనూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భామ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదే రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.